AP News:గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పరిశ్రమలు వెనక్కి పోయాయి: మంత్రి కొల్లు రవీంద్ర

by Jakkula Mamatha |   ( Updated:2024-11-29 09:31:23.0  )
AP News:గత ప్రభుత్వ నిర్వాకం వల్లే పరిశ్రమలు వెనక్కి పోయాయి: మంత్రి కొల్లు రవీంద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఏపీ ఛాంబర్ ఈ బిజినెస్ ఎక్స్ పో ఏర్పాటు చేయడం‌ అభినందనీయమని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(AP Excise Minister Kollu Ravindra) అన్నారు. నేడు(శుక్రవారం) ఏపీ ఛాంబర్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్స్ పో(Business Expo) లో మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ఎక్స్ పోలో వివరిస్తున్నారు. పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే అనువైన మార్గాలు ఇక్కడ తెలుసుకోవచ్చని తెలిపారు. మనకు తీర ప్రాంతంలో ఎంతో సంపద ఉంది. దానిపై దృష్టి పెట్టకపోవడం వల్ల నష్ట పోయామన్నారు. ఈ క్రమంలో విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని అన్నారు. సీఎం చంద్రబాబు వచ్చాక రాష్ట్ర రూపురేఖలు మారుతున్నాయన్నారు.

గతంలో చంద్రబాబు విజన్ 2020 అంటే నవ్వారు.. ఇప్పుడు హైదరాబాద్‌ను‌ చూస్తే చంద్రబాబు దూరదృష్టి అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పరిశ్రమలన్నీ వెనక్కి పోయాయి అని విమర్శించారు. ఇప్పుడు విజన్ 2047 అని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగుతుంది. గత ఐదేళ్లల్లో రాష్ట్రం వదిలిన వారు ఇప్పుడు మళ్లీ ఏపి‌ వైపు చూస్తున్నారు. ప్రభుత్వం పరంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు ఇస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఇటువంటి ఎక్స్ పో లకు వచ్చి ఉన్న అవకాశాలు తెలుసుకోండి. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు కూడా ఎంతో అవసరం. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు సత్తా చాటుతున్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story