కోడెల విగ్రహం విషయంలో వివాదం.. మంత్రి గొట్టిపాటి స్ట్రాంగ్ వార్నింగ్

by srinivas |   ( Updated:2024-11-04 11:11:39.0  )
కోడెల విగ్రహం విషయంలో వివాదం.. మంత్రి గొట్టిపాటి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, దివంగత కోడెల శివప్రసాద్(Former Minister, Late Kodela Sivaprasad) విగ్రహ ప్రతిష్ఠ వ్యవహారంపై పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) స్పందించారు. జిల్లా టీడీపీ (Tdp) నేతలు అందరి ఆధ్వర్యంలో ఘనంగా కోడెల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి కోడెల సేవలు వెల కట్టలేనివని కొనియాడారు. కోడెల అంటే టీడీపీ నేతలకు అపార గౌరవం ఉందన్నారు. త్వరలోనే కోడెల విగ్రహం ఆవిష్కరించి ఘన నివాళులర్పిస్తామని చెప్పారు. కోడెల విగ్రహం విషయంలో స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. ఎవరైనా సరే పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. కోడెల అభిమానులూ సంయమనం పాటించండని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపు నిచ్చారు.

కాగా కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నరసరావుపేటలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ విగ్రహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తొలిగించి బాత్ రూమ్ పక్కనున్న స్టోర్ రూమ్‌లో ఉంచారు. విషయం బయటకు తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యకం చేశారు. స్పీకర్ కు కంప్లైట్ చేయడంతో కోడెల విగ్రహాన్ని యథాస్థానలో ఉంచాలని ఆదేశించారు. అయితే స్పీకర్ ఆదేశాలను ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆదేశాలతోనే విగ్రహాన్ని తొలగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. దీంతో ఈ విషయంలో వివాదం నెలకొంది. పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటిని టీడీపీ నేతలు కలిసి పరిస్థితిని వివరించడంతో ఆయన సీరియస్ అయ్యారు. స్వార్థ రాజకీయాలు చేస్తే ఉపేక్షించమని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed