‘ముగ్గురు మృతి వార్త కలచివేసింది ’.. రోడ్డు ప్రమాదంపై మంత్రి దుర్గేష్ స్పందన

by Jakkula Mamatha |
‘ముగ్గురు మృతి  వార్త కలచివేసింది ’.. రోడ్డు ప్రమాదంపై మంత్రి దుర్గేష్ స్పందన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆటోలో 13 మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన పై తాజాగా మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. వ్యవసాయ పనులకు వెళ్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటన కలిచి వేసిందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి దుర్గేష్ ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందన..

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళల మృతి బాధాకరమని, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి జీజీహెచ్‌లో మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Next Story