మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని ఆగ్రహం..తప్పించుకోలేరంటూ వార్నింగ్

by srinivas |
మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని ఆగ్రహం..తప్పించుకోలేరంటూ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండదండలతో పెద్దిరెడ్డి భారీగా భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలో పర్యటించిన అనగాని సత్య ప్రసాద్ తప్పు చేసిన వారు తప్పించుకోవడం సాధ్యంకాదని చెప్పారు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు విచారణ వేగం పుంజుకుందన్నారు. భూములకు సంబంధించిన రికార్డులు పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో వందల సంఖ్యలో దొరికాయని అనగాని తెలిపారు. పెద్దిరెడ్డి బాధితులు సైతం వేల సంఖ్యలు ఉన్నారన్నారు. ఫైల్స్ దగ్ధం కేసులో ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. చిత్తూరు, తిరుపతి, రాజంపేట నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి బాధితులు చాలా ఎక్కువగా ఉన్నారని తెలిపారు. పెద్దిరెడ్డి దోచుకున్న వందల ఎకరాల భూములకు సంబంధించిన అధారాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి అనగాని హెచ్చరించారు.

Advertisement
Next Story

Most Viewed