- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి అమర్నాథ్‌కు ప్రతీ నెలా మామూళ్లు..దసపల్లా భూముల్లో ప్యాకేజీ: జనసేన నేత సంచలన ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో : ‘వైసీపీ నేతలకు వారాహి ఫీవర్ పట్టుకుంది.. జనసేన పేరు చెప్తే చాలు భయంతో వణికిపోతున్నారు’ అని విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఇప్పటివరకు లేని సెక్షన్ 30ని విశాఖ చుట్టుపక్కల అమలు చేస్తున్నారు అని అన్నారు. ఇలాగే ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఇవే ఆంక్షలు పెడితే, ఇదే సెక్షన్ 30 పెడితే పాదయాత్ర జరిగేదా..?ఒడ్డు దాటాక నావ తగల పెట్టినట్టు వైసీపీ వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు. వారాహి యాత్ర పేరు పెడితే ఎలా వస్తుందో చూస్తా అన్నారు... అసలు వారాహి రంగు సరికాదని అన్నారు….వారాహి వచ్చింది రెండు విడతలు విజయ యాత్ర పూర్తి చేసుకుంది మూడో విడత విశాఖలో అడుగుపెడుతుంది అని పీతల మూర్తి యాదవ్ అన్నారు. రాష్ట్రంలో వారాహి యాత్ర జరిగితే వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు అని చెప్పుకొచ్చారు. విశాఖ రాజధాని పేరు చెప్పి ఎంత గుల్ల చేశారు...కొండలను ఎలా తవ్వేశారో మెుత్తం ప్రపంచానికి పవన్ కల్యాణ్ తెలియజేస్తారు అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చెప్పుకొచ్చారు. విశాఖపట్నం వస్తున్న పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పది ప్రశ్నలు వేశారని తాము వైసీపీ ప్రభుత్వానికి వంద ప్రశ్నలు వేయాల్సి ఉందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పది ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు అని నిలదీశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏడాదికో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏది జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది జాబ్ క్యాలెండర్? అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిలదీశారు.
మంత్రి అమర్‌నాథ్‌కి మామూళ్ళు
నిప్పుకి తుప్పు పట్టదు.. నేను అవినీతి చేయను అని చెప్పే మంత్రి గుడివాడ అమర్నాథ్ విస్సన్నపేటలో 600 ఎకరాలు మీ బినామీ అవునా కాదా? అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అని నిలదీశారు. అనకాపల్లి సమీపంలో స్టోన్ క్రషర్స్ నుండి ప్రతినెలా మీకు వచ్చే మామూలు ఎంత? ఆర్‌ఈసీఎస్‌లో మీ హవా చూపించి మీరు నొక్కేసింది ఎంత? దసపల్ల భూములు వ్యవహారంలో ఎంత ప్యాకేజీ ముట్టిందో మంత్రి అమర్‌నాథ్ సమాధానం చెప్పాలి అని పీతల మూర్తి యాదవ్ నిలదీశారు. లూలూ రాలేదు...వేలాది ఉద్యోగాలు లేవు..వెయ్యి కోట్లు ప్రభుత్వ స్థలాలు మాత్రం వైసీపీ గెద్దలు గుప్పెట్లోనే అని ఆరోపించారు. మీరు పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత విశాఖ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి తెలుసా? అని అడిగారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తానన్నారు... ఇన్ఫోసిస్ కంపెనీ పెట్టేశామన్నారు ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటంలో వెనకడుగు వేయను అని చెప్పారు... మరి గంగవరం పోర్ట్ లో 11.4% వాటా ఎలా అమ్మేశారు? అని నిలదీశారు. వీటన్నింటికీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సమాధానం చెప్పాలని ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు ప్రశ్నలు అడగాలని పీతల మూర్తి యాదవ్ సూచించారు.
పోలవరం పూర్తయ్యేది ఎన్నడు
మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సైతం కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? మూడు రాజధానులు అని చెప్పిన మీరు కనీసం ఒక ఇటికైనా పేర్చారా అని నిలదీశారు. విశాఖ పరిపాలన రాజధాని పేరు చెప్పి దోచుకున్నారు అని మండిపడ్డారు. అమ్మ ఒడి పేరు చెప్పి బటన్ నొక్కారు ఎంతమంది ఖాతాదారులు డబ్బులు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు? పోనీ పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు ఇస్తారు? చెప్పాలని కోరారు. ‘మీ బాబాయ్ వైఎస్ వివేకాని చంపిన వారికి శిక్ష ఎప్పుడు పడుతుంది? అని ప్రశ్నించారు. పూర్తయిన టిడ్కో ఇల్ల గృహప్రవేశం ఎప్పుడు చేస్తారు? జగనన్న కాలనీలు పేరు చెప్పి నిర్మాణాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఈ నాలుగేళ్ల పాలనలో కూలగొట్టడం తప్ప మీరు కట్టింది ఏంటి? ఒక్క మీ వైసీపీ ఎంపీ విశాఖలో రూ.25వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. మీరేమో రూ.10 వేల కోట్లు ఉంటే చాలు విశాఖపట్నం అభివృద్ధి చేస్తానంటారు’ అని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే
విశాఖపట్నంలో అన్ని కొండలకు వైసీపీ నేతలు, బంధువులు బోడి గుండెలు కొట్టేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సీఎం భార్య వైఎస్ భారతి ఓ కొండ, వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయి రెడ్డి కుమార్తె ఓ కొండ, మీ మిత్రుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ కొండ, తమ్ముడు అనిల్ రెడ్డి ఓ కొండ.. మొత్తం విశాఖలోని కొండలన్నీ కొట్టేశారు? మీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు భీమిలి వైపు ఎర్రమట్టి దెబ్బలు మొత్తం తవ్వేశాడు. మీ మంత్రి అమర్నాథరెడ్డి విశాఖపట్నం రాకుండానే అనకాపల్లి కి ముందు విస్సన్నపేటలో 600 ఎకరాలు తినేశాడు. అంటే విశాఖపట్నం సరిహద్దు మొదలుపెట్టుకుని... విశాఖపట్నంలో కొండలు భూములు అన్ని వైసీపీ కబంధహస్తాల్లో తీసుకుంది. ఇన్నాళ్లు జరిగింది ఒక లెక్క.. ఇప్పుడు విశాఖలో జరిగేది ఓ లెక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత రెండు వారాహి యాత్రలకి విభిన్నంగా విశాఖ వారాహి యాత్ర ఉంటుంది అని చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ప్రతి అన్యాయాన్ని ప్రపంచానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియజేస్తారు అని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, ఓటర్లు సిద్ధంగా ఉన్నారు మా జనసేన సిద్ధంగా ఉంది... వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని పీతల మూర్తి యాదవ్ హెచ్చరించారు.