Minister Achennaidu: సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు.. ట్విట్టర్ వేదికగా అచ్చెన్నాయుడు మాస్ ర్యాగింగ్

by Shiva |
Minister Achennaidu: సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు.. ట్విట్టర్ వేదికగా అచ్చెన్నాయుడు మాస్ ర్యాగింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో సర్వే రాళ్లపై జగన్ తన ఫొటోలు, పేర్లు వేయించడం పట్ల మంత్రి అచ్చెన్నయుడు ట్విట్టర్ వేదికగా మాస్ ర్యాగింగ్ చేశారు. సమాధిపై ఫొటోలను ఎలా వేయిస్తారో.. అలా సర్వే రాళ్లపై జగన్ వేయించారని ఫైర్ అయ్యారు. పొలాల్లో దిష్టి బొమ్మలు పెట్టుకుంటే పక్షులు, కీటకాలు నుంచి విముక్తి లభిస్తుందని.. జగన్ ఫొటో పెడితే ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ ఫొటో ముద్రణకు రూ.650 కోట్ల ప్రజాధన వృథా చేశారని మండిపడ్డారు. పాలనను పక్కన పెట్టి.. ఆడంబరాలకు పోయిన జగన్ జనం ఇంటికి పంపించారంటూ అచ్చెన్నాయుడు మాస్ ర్యాంగింగ్ చేశారు.

Next Story