ఏపీ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్..ఈ నెలలో వరుస అల్పపీడనాలు!

by Jakkula Mamatha |
ఏపీ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్..ఈ నెలలో వరుస అల్పపీడనాలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు వచ్చినా పలు చోట్ల సరిగ్గా వానలు పడక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఐఎండీ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలో 3 అల్పపీడనలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఒకటి రెండు రోజుల్లో అల్పపీడనంగా మారనుందని పేర్కొంది. ఆ తర్వాత ఈ నెల 15, 23వ తేదీన కూడా ఇలాంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటివల్ల రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు, చెట్ల కింద, పొలాల్లో తిరగవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed