జనసైనికులకు BIG సర్‌ప్రైజ్.. పవన్ తరపున ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి?

by GSrikanth |
జనసైనికులకు BIG సర్‌ప్రైజ్.. పవన్ తరపున ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. గతకొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన పవన్ కల్యాణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ పిఠాపురం ఇన్‌చార్జి వర్మతో కలిసి రిటర్నింగ్ అధికారులకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అయితే, ఈ సారి తప్పకుండా పవన్ కల్యాణ్ గెలిచి తీరుతాడని ఒకవైపు సర్వేలు, మరోవైపు రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌కు మరింత మెజార్టీ తీసుకొచ్చే సెన్సేషనల్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు విస్తృతమయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో చిరంజీవి రెండ్రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తారని జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇదే నిజమైతే పవన్ కల్యాణ్‌కు లక్ష మెజార్టీ ఖాయమని నెటింట్లో పవన్ కల్యాన్ కల్యాణ్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story