విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థులు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-22 13:47:44.0  )
విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థులు
X

దిశ,వెబ్‌డెస్క్: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో పచ్చని ప్రకృతి ఒడిలో పాల నురగలతో పరవళ్లు తొక్కే జలతరంగిణి జలపాతం చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. ఎంతో సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతలు వేసుకుంటూ యువత ఆనందంగా అక్కడి పచ్చదనాన్ని చూస్తూ ఉండిపోతారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికి పైగా వైద్య విద్యార్థులు ఈ రోజు(ఆదివారం) జలతరంగిణి జలపాతం వీక్షించడానికి టూర్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. మొదటగా ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Next Story