- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి కొందరితోనే...అన్ అఫీషియల్‌గా ఎందరో: పవన్ పై మంత్రి అంబటి రాంబాబు
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు. నిజాయితీపరులైతే తన ప్రశ్నకు పవన్ కల్యాణ్ గానీ.. బ్రో నిర్మాత గానీ రెమ్యునరేషన్ వివరాలు బయటపెట్టాలని కోరారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ‘అత్యంత నిజాయితీపరుడెవరయ్యా..? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘నేను..’ అంటూ పవన్‌కళ్యాణ్ ముందుకొస్తాడు. తాను అత్యంత నీతిమంతమైన, నిజాయితీగల్గిన నాయకుడినంటూ చే గువేరా, భగత్‌సింగ్ అంటూ కమ్యూనిస్టు నేతల పేర్లు కొందరివి చెబుతాడు. అడవుల్లోకి వెళ్లాలనుకున్నానని ప్రజాసేవ కోసం వెళ్లలేకపోయానంటున్నాడాయన. నాకూ ఆయనకు వివాదం వచ్చింది కనుక నిజాయితీగా బ్రో సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో బయటపెట్టాలి’ అని మరోసారి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రోజుకు రూ.2కోట్లు తీసుకుంటానని బహిరంగంగా చెప్పిన పెద్దమనిషి పవన్ కల్యాణ్ బ్రో సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావయ్యా..? అంటే సమాధానం చెప్పడెందుకు..? మరి ఆయన పెద్ద నిజాయితీపరుడంటే మేమెలా నమ్మాలి.? ఆయన అఫీషియల్‌గా తీసుకునేది కొంత.. అన్ అఫీషియల్‌గా తీసుకునేది మరెంతో అంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
పెళ్లిళ్లపై మళ్లీ విమర్శలు
పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపైనా మరోసారి మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అఫీషియల్‌గా పెళ్లి చేసుకునేది కొందర్ని.. అన్ అఫీషయల్‌గా .. మేం చెప్పలేం అన్నారు. అన్ అఫీషియల్ గురించి తమకేం తెలియదని చెప్పుకొచ్చారు. ఇదీ పవన్‌కళ్యాణ్ జీవితం అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సినిమా సన్నివేశాల్లో పెట్టి కించపరుస్తానంటే ఐ డోంట్ కేర్.. సరే మాకుపోటీగా జనసేన తీసే సినిమాలో అవసరమనుకుంటే డబ్బులు తీసుకుని పవన్ కల్యాణ్‌ను కూడా నటించమని చెప్పండి. మాకేం అభ్యంతరం లేదు అని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన పార్టీ రాజకీయాలు మానుకుని సినిమాలు తీస్తానంటే తమకేమీ అభ్యంతరం ఉండదన్నారు. పవన్ కల్యాణ్ మీద సినిమా తీసేది వైసీపీ కాదని అంబటి అన్నారు. తన మిత్రులతో కలిసి తానే సినిమా తీస్తున్నట్లు అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన తన మీద సినిమా తీస్తే సంతోషిస్తాను అని అంబటి వెల్లడించారు. సందులో సంబరాల శ్యాంబాబు అలియాస్ రాంబాబు అని పేరు పెడుతున్నారని తెలిసిందని..ఆ సినిమా ఏదైనా కారణంతో ఆగిపోవాల్సి వస్తే.. అప్పుడు వాళ్లు తన దగ్గరకొస్తే తన వంతు సహకారం అందిస్తానని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
Read More..
పవన్ కల్యాణ్ నాతో పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం: శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!