- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుపతిలో మోహన్ బాబు బౌన్సర్ల రచ్చ రచ్చ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు మనోజ్

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో తనకు మద్దతుగా ఉన్న హోటళ్లు(Hotels), రెస్టారెంట్ల(Restaurants)పై మోహన్ బాబు బౌన్సర్లు దాడులకు తెగబడుతున్నారని మంచు మనోజ్(Manchu Manoj)అన్నారు. తిరుపతి ఎఫ్5 రెస్టారెంట్(Tirupati F5 Restaurant)పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. మోహన్ బాబు యూనివర్సిటీ(Mohan Babu University)లో ఉన్న ఓ కీలక వ్యక్తి.. విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అతని విషయాలన్నీ చెబుతున్నారన్న ఆక్రోశంతోనే మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఆస్తుల కోసం కాదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని మంచు మనోజ్ తెలిపారు. తెలంగాణ(Telangana)లో బౌన్సర్లు లేకుండా చూశారని చెప్పారు. మోహన్ బాబు యూనివర్సిటీలో వందలమంది బౌన్సర్లు రాత్రిళ్లు తాగి రచ్చ చేస్తున్నారన్నారు. తనకు మద్దతుగా ఉన్న వారి షాపులపై కర్రలు, రాడ్లతో దాడులు చేస్తున్నారని తెలిపారు. రెస్టారెంట్‌పై దాడి చేసిన ఘటనపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని(Mla Pulivarthi Nani) స్పందించాలని, ప్రజలకు ధైర్యం చెప్పాలని సూచించారు. సినిమా ఫంక్షన్ కోసం గురువారం రాయచోటికి వెళ్లానని మంచుమనోజ్ తెలిపారు. అయితే తనకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులు జరుగుతున్నాయని ఆ సమయంలో తనకు తెలిసిందని, అందుకే సినిమా ఫంక్షన్‌లో అలా మాట్లాడానని మంచు మనోజ్ పేర్కొన్నారు.
కాగా తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఎఫ్5 రెస్టారెంట్‌లో మోహన్ బాబు బౌన్సర్లు రచ్చ రచ్చ చేశారు. రెస్టారెంట్ నిర్వాహకులకు, మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. దీంతో రెస్టారెంట్‌లో మోహన్ బాబు బౌన్సర్లు దౌర్జన్యం చేశారు. అంతేకాదు కుర్చీలు, పర్నిచర్లు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మంచు మనోజ్ రెస్టారెంట్‌ను పరిశీలించారు. నిర్వాహకులకు మద్దతు తెలిపారు.