- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదృష్టం అంటే వీరిదే.. కోడి పందెంలో ఏకంగా ఆ వాహనం గెలుచుకున్నాడుగా
దిశ వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranti festival) అంటేనే గుర్తుకొచ్చేది పతంగులు, వంటకాలు, కోడి పందాలు(cockfight). ఈ కోడి పందాలు ఆంధ్ర ప్రాంతంలో ఓ సంస్కృతిలా మారిపోయింది. దీంతో ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన యువకులు, పెద్దలు, ముసలి వారు.. ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సొంత ఊళ్లకు వచ్చి కోడి పందాల్లో పాల్గొంటుంటారు. ఈ కోడి పందాలు ఇల్లీగల్ అయినప్పటికి పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే ఈ కోడి పందాల్లో కొందరు తమ అదృష్టంగా పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకుంటే.. మరికొందరు లక్ కలిసి రాక తమ వస్తువులతో పాటు ఆస్తులు కోల్పోతుంటారు. అయితే ఈ సంవత్సరం కోడి పందాలు.. కాస్త భిన్నంగా నిర్వహిస్తున్నారు. ఆశావాహుల నుంచి బెట్టింగ్ మనీ ని తీసుకొని.. గిఫ్ట్ ఫ్రైజులు అందిస్తున్నారు.
ఇందులో భాగంగా కొందరు నిర్వాహకులు తార్ వాహనాలను మొదటి ప్రైజ్‌గా ఉంచితే మరికొందరు బుల్లెట్ బైక్(Bullet bike) లను మొదటి ప్రైజ్ గా ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే ఆంద్రలోని ఓ ప్రాంతంలో నిర్వహించిన కోడి పందెం లో ఓ వ్యక్తి వరుసగా నాలుగు పందాల్లో గెలిచి.. ఏకంగా బుల్లెట్ బైక్ ను సొంతం చేసుకున్నారు. పందెంలో విజయం తర్వాత.. నిర్వహకులు విజేతకు బుల్లెట్ బైక్(Bullet bike) ను అందించగా.. అతడు తన కుమారుడిని బైక్ పైన కూర్చోబెట్టుకొని బయటకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న యువకులు పెద్ద గా అరుస్తూ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో లక్ అంటే వీరిదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి తండ్రి కొడుకులు ఈ కోడి పందెంలో ఏకంగా బుల్లెట్ బైక్ గెలుచుకోవడం.. వారికి ఈ సంక్రాంతి పండుగ కలిసొచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.