- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాచర్ల టీడీపీకి సరైనోడు! బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పడుతున్న జనం
దిశ ప్రతినిధి, మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి బ్రహ్మారెడ్డికి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మారెడ్డి ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న ప్రారంభంలో నేతలు, కార్యకర్తలు ఆయన వెంట నడిచేందుకు సాహసం చేయలేదు. అయినా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ క్యాడర్‌లో ధైర్యాన్ని నింపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బ్రహ్మారెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. అసమ్మతి, నేతల మధ్య అనైక్యత వంటి సమస్యలు మాచర్ల టీడీపీలో కన్పించడం లేదు.
నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరాలని టీడీపీ శ్రేణులంతా ముందుకు నడుస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ అంతా ఒకే తాటిపైకి వచ్చింది. ఆయన రాకతో మాచర్ల టీడీపీలో జోష్ నెలకొంది. పార్టీలో పూర్వవైభవం నెలకుంటోంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. అధికార పార్టీకి ఆయన ఎదురొడ్డి నిలబడి శ్రేణులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అధిష్ఠానం బ్రహ్మారెడ్డికి ఇచ్చిన హామీ మేరకు మాచర్ల టీడీపీ టిక్కెట్‌ను తొలి జాబితాలోనే చంద్రబాబు ప్రకటించారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు నేనున్నా అనే భరోసా కల్పిస్తూ బ్రహ్మారెడ్డి దూసుకుపోతున్నారు.
మాచర్లలో పార్టీ బలోపేతం..
బ్రహ్మారెడ్డి మాచర్లలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అన్న రీతిలో జూలకంటి వ్యవహరిస్తుండటం పార్టీ క్యాడర్‌లో ధైర్యన్ని నింపుతోంది. పార్టీ శ్రేణులు కూడా ఆయనకు అండగా నిలబడుతున్నారు. అధికార పార్టీ చర్యలను ఎండగట్టడంలోను ఈ స్థాయికి పార్టీని తీసుకురావడంలో బ్రహ్మారెడ్డి విశేషంగానే కృషి చేశారని చెప్పవచ్చు. మాచర్ల నియోజకవర్గంలో వరుసగా నాలుగు పర్యాయాల నుంచి టీడీపీ ఓటమిని చవిచూస్తున్నది. ప్రతి సారి అధిష్ఠానం ఇక్కడ ప్రయోగాలు చేస్తూ అభ్యర్థులను బరిలో దింపుతుంది.
అయినా.. విజయాన్ని అందుకోలేకపోయింది. పార్టీ క్యాడర్ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకే సాహసించని పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అధికార పార్టీ ఆగడాలను తట్టుకోలేక నాయకులతో పాటు కార్యకర్తలు సైతం గ్రామాలను వదిలి వెళ్లిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భయాందోళనల నుంచి ఇప్పుడిప్పుడే నాయకులు, కార్యకర్తలు బయటకు వస్తూ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు.
గట్టి నేతకు పగ్గాలు..
మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశంపార్టీ తరపున గట్టి నేతకు పగ్గాలు అప్పగించినట్లైంది. జూలకంటి బ్రహ్మారెడ్డిని నియోజకవర్గంలో రిసీవ్ చేసుకున్న విధానంతోనే ఈ విషయం అర్థమవుతోంది. జూలకంటి తల్లిదండ్రులు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే. అంటే జూలకంటిది మంచి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం.. ఇదే సమయంలో నియోజకవర్గం ఇన్చార్జి పదవి కోసం కుర్రి పున్నారెడ్డి, మధుబాబు కూడా ప్రయత్నించి జూలకంటికే మద్దతు ప్రకటించారు. దాంతో నియోజకవర్గానికి వచ్చిన జూలకంటికి బ్రహ్మాండమైన స్వాగతం లభించటం విశేషం. ఇన్చార్జిగా అపాయింట్ అయిన జూలకంటిని పార్టీ నేతలు, కార్యకర్తలంతా కలిసి పెద్ద ఊరేగింపుగా మాచర్ల పట్టణంలోకి తీసుకొచ్చారు.
దాంతో పార్టీలో కొత్త హుషారు వచ్చినట్లయ్యింది. జూలకంటి రాకముందు మాచర్లలో పార్టీ మొత్తం స్తబ్దుగా ఉంది. అలాంటిది జూలకంటి నియామకం వల్ల ఒక్కసారిగా జోష్ మొదలైంది. ఇంకాలం తనకు ఎదురే లేదన్నట్లుగా ఉన్న పిన్నెల్లికి జూలకంటి గట్టి పోటీదారు అన్నట్లు వ్యవహారం తయారైంది. ప్రజల్లో కూడా మాచర్ల టీడీపీకి సరైనోడు దొరికాడనే టాక్ మొదలైంది. మాచర్ల అభ్యర్థిగా బ్రహ్మారెడ్డిని ప్రకటించి జోరు మీదున్న టీడీపీకి మద్దతుగా గ్రామాల్లోంచి జన సైనికులు కదిలి వస్తున్నారు. తెలుగు తమ్ముళ్లతో కలిసి వచ్చి దేశం అభ్యర్థులకు మద్దతు తెలిపి తమ మద్దతు ప్రకటిస్తున్నారు.