Duvvada Srinivas : శ్రీనివాస్‌తో కలిసి ఉంటా..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వాణి

by srinivas |   ( Updated:2024-08-17 14:01:46.0  )
Duvvada Srinivas : శ్రీనివాస్‌తో కలిసి ఉంటా..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన వాణి
X

దిశ, వెబ్ డెస్క్: దువ్వాడ ఫ్యామిలీ వివాదానికి తెరపడినట్లుగా కనిపిస్తోంది. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉంటున్నారంటూ కొద్దిరోజులుగా నిరసన తెలిపిన భార్య వాణి చివరకూ వెనక్కి తగ్గారు. పిలల భవిష్యత్ కోసం దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఉంటానని ఆమె తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ ఎవరితో తిరిగినా తాను పట్టించుకోనని చెప్పారు. పిల్లల భవిష్యత్తు తనకు ముఖ్యమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరసన వ్యక్తం చేయలేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు.

‘‘నాకు డబ్బులు అవసరం లేదు. నాపై శ్రీనివాస్ దుష్ప్రచారం చేశారు. నాతో కలిసి ఉంటానని పేపర్ రూపంలో రాసిస్తే చాలు. పిల్లల బాధ్యతను శ్రీనివాస్ తీసుకోవాలి. ఎవరి లైఫ్ వారిదిగా ఒకే ఇంట్లో ఉంటాం.’’ అని దువ్వాడ వాణి పేర్కొన్నారు.

Advertisement

Next Story