ఊరట దక్కేనా?: మరో రెండు కేసుల్లో Nara Lokesh ముందస్తు బెయిల్‌ పిటిషన్లు

by Seetharam |   ( Updated:2023-09-29 14:46:54.0  )
ఊరట దక్కేనా?: మరో రెండు కేసుల్లో Nara Lokesh ముందస్తు బెయిల్‌ పిటిషన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో చుక్కెదురు అవ్వడంతో తాజాగా లోకేశ్ తరఫు న్యాయవాదులు మరో పిటిషన్లు దాఖలు చేశారు. మరో రెండు కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌ కేసుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌పై అత్యవసరంగా విచారించాలని లోకేశ్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ పిటిషన్లు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఐడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. నారా లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేశ్‌కు సీఐడీ బృందం నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Nara Lokesh : ఏపీ హైకోర్టులో నారా లోకేశ్‌కు చుక్కెదురు

Advertisement

Next Story

Most Viewed