Nara Lokesh :పాదయాత్రకు ముహూర్తం ఖరారు

by Sumithra |   ( Updated:2023-01-13 09:33:17.0  )
Nara Lokesh :పాదయాత్రకు ముహూర్తం ఖరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ ఈనెల 27 నుంచి పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. లోకేశ్ పాదయాత్రకు యువగళం పేరును సైతం టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పాదయాత్రకు రోజులు సమీపిస్తున్న తరుణంలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నాయకత్వం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల చొప్పున 100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర ఉండేలా రూట్ మ్యాప్ ఇప్పటికే రూపొందించారు. దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ఇకపోతే ఈ నెల 27న మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్రను లోకేశ్ మెుదలు పెట్టనున్నారు. తొలుత వరదరాజస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం తీసుకోనున్నారు. అనంతరం పాదయాత్రకు శ్రీకారం చుడతారు. ఇకపోతే కుప్పం నియోజకవర్గంలో ఈ పాదయాత్ర మూడు రోజులపాటు జరగనుంది. మొత్తం 29 కిలోమీటర్ల మేర కుప్పంలో పాదయాత్ర కొనసాగనుంది అని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి.

Read more:

'జన్మభూమి స్పూర్తితో గ్రామాల అభివృద్దికి అంతా కలిసి రావాలి'

Advertisement

Next Story

Most Viewed