- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారుణం.. ఇంటర్ విద్యార్థిని పై లెక్చరర్ లైంగిక దాడి

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇటీవల మహిళలు, బాలికలపై లైంగిక దాడి(sexual assault) ఘటనలు కలకలం రేపుతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు లైంగికదాడులు చోటుచేసుకోవడం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. మహిళలపై లైంగికదాడికి పాల్పడి ఆ తర్వాత హత్యలు చేయడం వంటి ఘటనలు కూడా వెలుగు చూస్తునే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి(Rajamandri)లో ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్(Private College Lecturer) దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఆ విద్యార్థినిపై మూడు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే కూతురు కనిపించకపోవడంతో కొవ్వూరు పోలీస్ స్టేషన్(Police Station)లో విద్యార్థిని తల్లి మిస్సింగ్ కేసు(Missing Case) నమోదు చేసింది.
ఈ విషయం తెలిసిన లెక్చరర్ బాలికను భీమవరం(Bhimavaram)లో వదిలి పారిపోయాడు. గత(జనవరి) నెల 28వ తేదీన విద్యార్థినిని విజయవాడ(Vijayawada) తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతరం ఇంటికి పంపించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ తరుణంలో తన తల్లికి ఫోన్ చేసి బాలిక విషయం చెప్పడంతో పోలీసులు మిస్సింగ్ కేసును పోక్సో కేసు(Pocso Case)గా మార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.