- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lady Bouncers: కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రముఖులు (Movie Celebrities), రాజకీయ నాయకుల (Politicians) వెంట ఉండే బౌన్సర్లను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కరు ఆరు ఫీట్ల ఎత్తుతో కండలు తిరిగిన దేహాలతో కనిపిస్తుంటారు. వారిని కాదని ఎవరైనా సెలబ్రిటీల దగ్గరకు వెళితే.. ఎత్తి అవతల పడేయడం మనం చూశాం. కానీ, తాజాగా సంక్రాంతి (Sankranti) పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా (Eluru District)లో నిర్వహిస్తున్న కొడి పందాల్లో అక్కడి నిర్వాహకులు వినూత్నంగా లేడీ బౌన్సర్ల (Lady Bouncers)ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ (Center of attraction)గా మారాయి.
కాగా, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లో జోరుగా సంక్రాంతి పండుగ సందర్భంగా జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. దాదాపు 450కి పైగా బరుల్లో పందాలను నిర్వహిస్తున్నారు. మురముళ్ల (Muramulla), కాకినాడ రూరల్ (Kakinada Rural), రాజమండ్రి రూరల్ (Rajahmundry Rural), నిడదవోలు Nidadavolu), ఉండి (Undi) నియోజకవర్గాల్లో పెద్ద కోడిపందాల్లో రూ.25 లక్షల పైనే ఒక్కో పందెం నడుస్తుంది. అయితే, కోడి పందాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ (Hyderabad) నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉభయ గోదావరి జిల్లాలకు క్యూ కట్టారు.