శ్రీశైలం గౌరీ సదన్‌లో ఇద్దరు ఆత్మహత్య

by srinivas |   ( Updated:2024-02-17 12:20:25.0  )
శ్రీశైలం గౌరీ సదన్‌లో ఇద్దరు ఆత్మహత్య
X

దిశ, శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం గౌరీ సదనంలో మహిళ, పురుషుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈనెల 13న మల్లేష్ అనే వ్యక్తి రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్‌లో నమోదు అయింది. పక్క రూము తీసుకున్న యాత్రికులకు శనివారం ఉదయం దుర్గధం రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూము దగ్గరికి వెళ్లిన సిబ్బంది ఒక్కసారిగా నిర్గాంత పోయారు. ఉరివేసుకుని వేలాడుతున్న ఇద్దరిని చూసి ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మహిళకు సంబంధించిన ఆధార్ లభించింది. కత్తి, శానిటైజర్ బాటిల్ సైతం దొరికాయి. అయితే మరణించిన మహిళ, పురుషుడు దంపతులా లేదా.. ప్రేమ జంటనా అనే కోణంలో శ్రీశైలం పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story