- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yemmiganur: దైవందిన్నెలో తాగునీటికి కటకట
దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండల మండల పరిధి దైవందిన్నె గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని స్థానిక మహిళలు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సుధూర ప్రాంతాలకు వెళ్లి అష్ట కష్టాలు పడి తాగునూరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గోనెగండ్ల మండలం అల్వల గ్రామంలో ఉన్న స్టోరేజీ చెరువు నుంచి మంచినీరు సరఫరా చేస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. గ్రామస్తులు రాయలసీమ కోఆర్డినేట్ కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాగు నీరు వారానికి ఒక్కసారి సరఫరా చేస్తున్నారని, అవి చాలకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.