- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Devanakonda: వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
by srinivas |

X
దిశ, దేవనకొండ: వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా దేవనకొండలో చోటుచేసుకుంది. ఆదోనికి చెందిన మహిళకు దేవనకొండ గ్రామానికి చెందిన చాకలి నరేష్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అయితే భర్తతోపాటు కుటుంబ సభ్యులు వేధింపులు తట్టుకోలేక బాధితురాలు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు అన్న నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త మామతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.
Next Story