Kurnool: పాలిష్ పేరుతో ఘరానా మోసం... ముగ్గురు యువకులకు దేహశుద్ధి

by srinivas |
Kurnool: పాలిష్ పేరుతో ఘరానా మోసం... ముగ్గురు యువకులకు దేహశుద్ధి
X

దిశ, వెబ్ డెస్క్: పాలిష్ పేరుతో గ్రామస్తులను నలుగురు యువకులు మోసం చేసేందుకు యత్నించారు. ఆభరణాలకు మెరుగు పెడతామని యువకులు ఆదివారం కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటకు వెళ్లారు. వెండికి మెరుగు పెడతామని స్థానికులను నమ్మించారు. ఈ క్రమంలో పాలిష్ చేయమని యువకులకు వెండిని ఇచ్చారు. అయితే పాలిష్ పెట్టే క్రమంలో వెండిని కొట్టేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు నిలదీశారు. దొరికిపోయే సరికి నలుగురిలో ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయారు. మిగిలిన ముగ్గురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed