- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Interview: టీడీపీదే రాజ్యాధికారం
దిశ, కర్నూలు: రానున్నది టీడీపీ రాజ్యమేనని, వైసీపీ అరాచక పాలనతో ప్రజలంతా విసిగిపోయారని, ఉద్యోగులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రతి ఒక్కరూ అరాచక ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడ్డాయని ఆదోని మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షి నాయుడు అన్నారు. తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకు జనాధారణపెరగడంతో ఓర్వలేని వైసీపీ నాయకులు తిరగబడి బెదిరింపులకు పాల్పడడం చేస్తు్న్నారని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో చూసుకోవాలి తప్ప రౌడీలుగా వ్యవహరించడం సరికాదన్నారు. బుధవారం ఆయన నివాసంలో భవిష్యత్ కార్యచరణ, ప్రభుత్వ వైఫల్యాలు తదితర అంశాలపై మీనాక్షి నాయుడుతో దిశ ఇంటర్వూ నిర్వహించింది.
దిశ: రాష్ట్ర పాలన ఎలా ఉంది ?
మాజీ ఎమ్మెల్యే: రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ఎక్కడ చూసినా ప్రజలు సుఖ సంతోషాలతో లేరు. ఎప్పుడు ఎన్నికలొస్తాయా ? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
దిశ: జిల్లాలో ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉంది ?
మాజీ ఎమ్మెల్యే : జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టినవే. వాటికి నిధులు కూడా మంజూరు చేశాం. వైసీపీ వచ్చిన తర్వాత ఏప్రాజెక్టుకు కూడా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. అందుకే ఎక్కడ చూసినా ప్రాజెక్టు్ల్లో పనులు ముందుకు సాగడం లేదు.
దిశ: టిడ్కో ఇళ్ల నిర్మాణ విషయంలో ఏ మేరకు పురోగతి సాధించారు ?
మాజీ ఎమ్మెల్యే: టిడ్కో ఇళ్ల పరిస్థితి విషయానికొస్తే నాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా ఉన్నాయో నేటికీ అలాగే ఉన్నాయి. కేవలం డబ్బులు ఖర్చు చేసి రంగులు మార్చారు తప్పఅక్కడ చేసిందేమీ లేదు. వాటి రూపు రేఖలు మార్చడానికి నిధులు మంజూరు చేయడంలేదు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులన్నింటికి ఎలాంటి నిధులు విడుదల చేయలేదు.
దిశ: రానున్న ఎన్నికల్లో 175 కు 175 గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అది సాధ్యమౌతుందా ?
మాజీ ఎమ్మెల్యే: 175కు 175 సీట్లు గెలుస్తామని చెప్పడం జగన్ భ్రమ. రాష్ర్టంలో ఎక్కడా సీటు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తు్న్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల అనేక మందికి ఉపాధి లేకుండా పోయింది. తమ ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపంలో ముందుకెళుతున్నాం. ప్రజలంతా తమ వెంటే ఉన్నారు. ప్రజల ఆశీస్సులతో రాజ్యాధికారం చేపట్టి రాష్ర్ట ప్రజలకు సుపరిపాలన అందిస్తాం.
ALSO READ : ఆంధ్రాలో కన్నా నాకు తెలంగాణలోనే ఆదరణ ఎక్కువ : చంద్రబాబు