2024 Elections: మైలవరం టికెట్ మళ్లీ ఆ సామాజిక వర్గానికే...!

by srinivas |
2024 Elections: మైలవరం టికెట్ మళ్లీ ఆ సామాజిక వర్గానికే...!
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా మైలవరంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌‌కు సీటు కష్టమనే సంకేతాలు ఇప్పటికే పంపింది. 2014 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం నేతకు మైలవరం సీటు కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి దేవినేని ఉమ గెలుపొందారు. కానీ 2019లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్‌కు సీటు ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఈసారి మాత్రం మైలవరం నియోజకవర్గానికి కొత్త ఇంచార్జిని ప్రకటించాలనే యోచనలో అధిష్టానం ఉంది. ఈ మేరకు కొత్త వ్యక్తిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే యాదవ సామాజికి వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో చేయించిన సర్వేల్లో వసంత కృష్ణ ప్రసాద్‌కు నెగిటివ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో వసంత కృష్ణ ప్రసాద్‌కు కాకుండా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటి వరకూ ఐదు జాబితాలు విడుదల చేసిన పార్టీ మరో దానిపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం పలువురు బీసీ నాయకుల పేర్తను పరిశీలిస్తోంది. త్వరలో జాబితా రెడీ చేసి విడుదల చేయాలని భావిస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గం నేతలు ఈసారి సైతం తమ వర్గం వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ మేరకు వైసీపీ అధిష్టానికి సమాచారం అందించారట. మరి సీఎం జగన్ పునరాలోచించి కమ్మ సామాజిక వర్గానికి మళ్లీ అవకాశం కల్పిస్తారేమో చూడాలి.

మరోవైపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సారి సీటుపై ఆధిష్టానం ఆయనకు క్లారిటీ ఇచ్చిందట. దీంతో వైసీపీని వీడి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read More Andhra Pradesh Election News

డబ్బుకు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్న చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed