Kidnap Case: జైలులో వసతులపై ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక ఆదేశాలు

by srinivas |   ( Updated:2025-02-24 10:30:35.0  )
Kidnap Case:  జైలులో వసతులపై ఎస్సీ, ఎస్టీ కోర్టు  కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ(Gannavaram Foremer MLa Vallabhaneni Vamsi)ని పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Vijayawada SC ST Court) అనుమతించింది. సత్యవర్థన్ కిడ్నాప్‌ కేసు(Satyavarthan Kidnapping Case)లో ఆయనను మరింత విచారించాలని, వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం పోలీసుల అభ్యర్థనను ఏకీభవించింది. ఈ మేరకు వంశీకి కస్టడీకి ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు జైలులో బెడ్ ఏర్పాటుకు కూడా అనుమతింది. దీంతో కస్టడీలోకి తీసుకునే మూడు రోజుల పాటు వంశీని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లాయర్ సమక్షంలో వరకూ పోలీసులు విచారించనున్నారు. అలాగే విచారణకు ముందు, తర్వాత కూడా మెడికల్ టెస్టులు చేయనున్నారు. ఈ మేరకు వంశీని మంగళవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. పలు ప్రశ్నలు సంధించనున్నారు.

మరోవైపు వ్యక్తి కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ మంగళవారంతో ముగియనుంది. దీంతో సీఐడీ కోర్టులో వంశీని పోలీసులు ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్ జారీ చేశారు. అటు వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోస్ చేసింది. ఈ మేరకు సీఐడీ కోర్టులో వంశీని మంగళవారం ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story

Most Viewed