- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజకీయాల నుంచి తప్పుకున్న ఏపీ ఎమ్మెల్యే.. కారణం ఆయనేనా..?
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కొందరు రాజకీయాలకు స్వస్తి చెబుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని చెబుతున్నారు. అయితే ఇందుకు కారణం ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రక్షణనిధి రెండుసార్లు గెలిచారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని అర్హులకు అందరికీ అందజేశారు. ఎప్పుడూ ప్రజల్లోనే తిరుగారు. కానీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడం కష్టమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా మరొకరిని తిరువూరు ఇంచార్జిగా ప్రకటించారు.
దీంతో జగన్ నిర్ణయంపై రక్షణనిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు అసలు రాజకీయాల నుంచి కూడా తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎందుకంటే అధిష్టానం ఎలా చెబితే అలా చేయాలని.. కొన్ని సమయాల్లో అది కష్టంగా ఉంటుందని చెప్పారు. అధికారంలో ఉండి, సంక్షేమ పథకాలు అమలు చేసి కూడా ప్రతిపక్షంపై తీవ్రమైన విమర్శలు చేయడమంటే తమ వల్ల కావడం లేదని.. ప్రస్తుతం అదే ఇబ్బందైందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ను ఎవరైతే తిడతారో వారికే వైసీపీలో పదవులు పదిలంగా ఉంటాయని.. మిగిలిన వారికి ఎప్పుడు ఊడిపోతాయో తెలియదని చెప్పారు. ఈ బాధలన్నీ పడలేకే తాను వైసీపీకి, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు రక్షణనిధి తెలిపారు. గత ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి, పెద్ది రెడ్డి తనకు సహకరించారని చెప్పారు. ప్రస్తుతం జగన్‌కు ఏమైనా చెబుదామంటే అక్కడి దాకా వెళ్లలేని పరిస్థితిని సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తానుగానే ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని రక్షణనిధి వెల్లడించారు.
Read More..
ఈ సారి కేంద్రంలో ఆ పార్టీదే అధికారం.. తేల్చిచెప్పిన చంద్రబాబు