బెజవాడ పశ్చిమకు ఏమిచ్చావు జగన్: P.Srinivas

by srinivas |
బెజవాడ పశ్చిమకు ఏమిచ్చావు జగన్: P.Srinivas
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగునరేళ్లు కావస్తున్నా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విజయవాడ 55వ డివిజన్ వించిపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను చాలా అంశాల్లో ఈ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, కొండ ప్రాంత ప్రజలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ, కరకట్ట ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాల మంజూరు, ఎర్రకట్ట విస్తరణ, స్టేడియం నిర్మాణం, హజ్ హౌజ్ నిర్మాణం అన్నీ హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఫల్యం చెందారని పెందుర్తి శ్రీనివాస్ విమర్శించారు.

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా పేదల ఉసురు పోసుకున్నారని పెందుర్తి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజరాజేశ్వరి పేట రైల్వే కట్ట ప్రాంతంలో 990 కుటుంబాలకు నివాసాల స్థల వివాదం హామీచ్చి పరిష్కారం చూపకపోతే ఇప్పటికీ మూడు సార్లు ఎంపీ కేశినేని నాని చొరవతో రైల్వేశాఖ మంత్రి సానుకూలతతో అదే సమస్యతో ఆ కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయన్నారు. కేంద్రం నుంచి ఎంపీ కేశినేని నిధులు తెచ్చినా రాష్ర్ట ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయలేకపోయిందని మండిపడ్డారు. భవాని ద్వీపం అభివృద్ది పేరుతో బరం పార్కు తాకట్టు పెట్టి రూ.149 కోట్లు తెచ్చి ఒక్క అభివృద్ది పని చేయలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో 8 వేల కుటుంబాలకు కోర్టు వివాదంలో ఉన్న అమరావతి భూమిలో సెంటున్నర గ్యారంటీ లేని షరతులున్న పట్టాలిచ్చి ఘరానా మోసం చేశారని పెందుర్తి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed