- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP: చంద్రబాబు ర్యాలీలో మళ్లీ ఆయన ఫొటోలు.. సీఎం అంటూ నినాదాలు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. అయితే ఆయన నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ, తారకరత్న ఫొటోలు దర్శనమిచ్చాయి. ముగ్గురి ఫొటోలను పట్టుకుని తెలుగు తమ్ముళ్లు ప్రదర్శనలు చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ఫొటోలను చూపిస్తూ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ రావాలంటూ ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఎక్కడ టీడీపీ సభలు జరిగినా ఎన్టీఆర్ ఫొటోలు, ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఇటీవల మరణించిన తారకరత్న ఫొటోలు కూడా ప్రదర్శించడం విశేషం. అయితే గతంలోనూ చంద్రబాబు సభల్లో ఎన్టీఆర్ ఫొటోలను ప్రదర్శించారు. చంద్రబాబు ఇలాక కుప్పంలోనూ ఎన్టీఆర్ ఫొటోలను తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఆహ్వానించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. టీడీపీకి తన సేవలు ఎప్పుడు అవసరమైనా చేస్తానని గతంలో ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి సినిమాల్లో బిజీగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన ఫొటోలు మాత్రం టీడీపీ సభల్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి.