Prakasam Barrage: బోట్ల విషయంలో కీలక నిర్ణయం.. రోప్‌లు, కొక్కేలు రెడీ

by srinivas |
Prakasam Barrage: బోట్ల విషయంలో కీలక నిర్ణయం.. రోప్‌లు, కొక్కేలు రెడీ
X

దిశ, ఏపీ బ్యూరో: బెజవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోట్లు అధికారులు, కార్మికులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కార్మికులు 4 రోజులుగా రేయింబవళ్లు గంటల తరబడి తీవ్రంగా శ్రమిస్తున్నా బోట్లు కదలడం లేదు. ఈనెల 10న భారీ క్రేన్లను తీసుకొచ్చి బోట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. 11, 12 తేదీల్లో విశాఖ నుంచి వచ్చిన డైవింగ్ టీం నది లోపలికి వెళ్లి బోటును రెండు ముక్కలుగా కోసేందుకు శ్రమించారు. అయితే నీటిలో బోటును పూర్తిగా ముక్కలు చేయడం సాధ్యపడలేదు. దీంతో బలమైన గొలుసులను బోటుకు కట్టి వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

రంగంలోకి కాకినాడ టీమ్..

బోల్తా పడిన బోట్లను భారీ పడవల సాయంతో వెనక్కి లాగేందుకు కాకినాడకు చెందిన టీంను రంగంలోకి దించారు. శుక్రవారం ఉదయం నుంచి చిక్కుకున్న బోట్లను బయటకు లాగేందుకు టీం తీవ్రంగా శ్రమించింది. ఒక్కోటి 50 టన్నులకు పైగా బరువును పైకి లాగే సామర్థ్యం ఉన్న 7 శక్తివంతమైన పడవలను తెప్పించారు. పైకి లేపేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో బోటు తొలగింపు ప్రక్రియను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం ఉదయం పొడవాటి, దృఢమైన రోప్‌లు, కొక్కేలను పడవకు కట్టి బయటకు తీయాలని అధికారులు నిర్ణయించారు

Advertisement

Next Story

Most Viewed