Cm Jagan Birth Day Fest: స్టెప్పులేసిన మంత్రి రోజా

by srinivas |   ( Updated:2022-12-19 14:51:20.0  )
Cm Jagan Birth Day Fest: స్టెప్పులేసిన మంత్రి రోజా
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ఫైర్ బ్రాండ్.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాలో ఏమాత్రం సినీ జోష్ తగ్గలేదు. పాట వినిపిస్తే చాలు స్టేజ్ ఎక్కి స్టెప్పులు వేస్తూ అందర్నీ అలరిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రోజా తన డాన్స్ ఫెర్ఫాన్స్‌తో స్టేజ్‌పై దుమ్ముధుళిపేస్తున్నారు. తప్పెటగుళ్ల నృత్యం, కూచిపూడి, మాస్ సాంగ్స్‌కు మాస్ స్టెప్పులువేస్తూ అదరహో అనిపిస్తున్నారు.

తాజాగా సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యం, కాళికామాత నృత్య ప్రదర్శన జరిగింది. అనంతరం తేళ్లు, నాగపాముతో కళాకారులు చేసిన ప్రదర్శన వీక్షకుల మన్ననలు పొందాయి. అనంతరం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన జోషిక శివునిపై జానపదం గానంతో అలరించింది. ఆ తర్వాత డి.ద్వారతి బృందంతో లంబాడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. సంస్కృతి, సంప్రదాయలను కాపాడేలా బంజారా కళాకారులు వరినాట్లు, కోతలు, ఇంకా ఇతర వ్యవసాయ పనులను నృత్యరూపం చేస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. స్టేజి కింద నుండి వీక్షిస్తున్న మంత్రి రోజా.. వెంటనే స్టేజి పైకి వెళ్లి లంబాడి బృందంతో నృత్యం చేశారు. బృందంలోని ప్రతి కళాకారిణికి షేక్ హ్యాండ్ ఇచ్చి మంత్రి రోజా అభినందనలు తెలిపారు.

READ MORE

21న బాపట్ల జిల్లాకు Cm Jagan

Advertisement

Next Story