- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం చంద్రబాబుపై అపార నమ్మకం ఉంది: లోక్‌సత్తా చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై ఏపీ ప్రజలకు అపార నమ్మకముందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ(Loksatta president Jayaprakash Narayana) తెలిపారు. విజయవాడ(Vijayawada)లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే సామర్థ్యం చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేయాలని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడేలా నేతలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పారు. రూ. 9.64 లక్షల కోట్లు మేర అప్పు ఉందని, వచ్చే ఆదాయంలో సగం వడ్డీ కట్టడానికే సరిపోతుందని తెలిపారు. గత ప్రభుత్వం అభివృద్ధిని మరిచి డబ్బులు పంచుడుపైనే ఫోకస్ పెట్టిందని ఎద్దేవా చేశారు. అప్పులు చేసి బటన్లు నొక్కడంతో రాష్ట్రం దివాళా తీసిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం రోడ్ల వేయలేదని, కనీస మరమ్మతులు కూడా చేయలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చుతోందని జయప్రకాశ్ నారాయణ తెలిపారు.