- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌పై సైనిక్ దళ్, సమతా సైనికులు ఆగ్రహం.. కోర్టుకు రావాల్సిందేనంటూ డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: కోడి కత్తి శ్రీను తల్లి దీక్షకు అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా సైనిక్ దళ్, సైనికులు మద్దతు తెలిపారు. కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని శ్రీను కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడ శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో శ్రీను తల్లి, సోదరుడు దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష చేస్తామని చెప్పారు. అయితే ఈ దీక్ష ఇవాళ్టితో రెండో రోజుకు చేరుకుంది. మరోవైపు శ్రీను కుటుంబ సభ్యులను దీక్ష విరమించాలని పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి దీక్షకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు దళిత సంఘాలు సంఘీభావం తెలిపాయి.
తాజాగా సైనిక్ దళ్, సమతా సైనికులు మద్దతు తెలిపారు. శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. జగన్ పాదయాత్రలో ఎస్సీలపై కపట ప్రేమ చూపించారని మండిపడ్డారు. ఎస్సీలను నాశం చేసేందుకు సీఎం జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను జగన్ నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోతి కత్తి కేసులో శ్రీనును ఇరికించి వైఎస్ జగన్ రాజకీయంగా లబ్ధి పొందారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ ఉంటే కోడి కత్తి కేసులో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు తిరుగుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కోర్డుకు రావడం లేదని ప్రశ్నించారు. కోడి కత్తి శ్రీను జైలు నుంచి బయటకు వస్తే చాలా నిజాలు బయటకు వస్తాయని సీఎం జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు ఎస్సీలపై ఈర్ష ఉందని, అందుకే జగన్ సాక్ష్యం చెప్పటం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించికపోతే రేపటి నుంచి అన్ని జిల్లాల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సమతా సైనికులు, సైనిక్ దళ్ సభ్యలు హెచ్చరించారు.
Read More..
సొంత బాబాయ్‌ను ఘోరంగా చంపారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు