- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gannavaram Dsp: అంజన్ మొబైల్‌లో గే వీడియోలు.. రెచ్చగొట్టేలా మెసేజ్‌లు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రవాసాంధ్రుడు పొందూరు అంజన్ చౌదరి అరెస్ట్‌పై పోలీసులు ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులపై విద్వేషపూరిత పోస్టులు చేస్తూ, వివిధ రాజకీయ, సామాజిక పక్షాల మధ్య విద్వేషాలను పురికొల్పే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేసినట్లు గన్నవరం పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. గన్నవరం సీఐ కనకారావుకి అందిన ఫిర్యాదు ఆధారంగా గన్నవరం రామానగర్‌కు చెందిన పొందూరు అంజన్ చౌదరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అంజన్ చౌదరి ఫేస్ బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ‘అంజన్ # యువగళం’ అను అకౌంట్ ద్వారా ప్రముఖ వ్యక్తులపై విద్వేషపూరిత పోస్టులు పెడుతూ, ప్రజా ప్రతినిధులపై ద్వేషం, అసత్యాలతో కూడిన సందేశాలను పోస్ట్ చేయడం ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అంజన్ అమెరికాలో టార్గెట్ కార్పొరేషన్ కంపెనీలో మూడేళ్లపాటు ఉద్యోగం చేసి 2015లో స్వగ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టుల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాడని పోలీసులు ఆరోపించారు. అంతేకాదు మద్యానికి బానిసగా మారాడని వెల్లడించారు. విషపూరిత ప్రచారం ఆరోపణల నేపథ్యంలో అంజన్ మొబైల్ ఫోన్, ట్యాబ్ తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పరికరాలను పోలీసు వారు జప్తు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫారెన్సీక్ సైన్స్ లాబరేటరీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు.
అంజన్ స్వభావరిత్యా స్వలింగ సంపర్కుడని, ఆయన ఫోన్, టాబ్‌లో వందలకొద్ది గే - వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టిండర్ క్రెడిట్, క్యూపిడ్, గ్రిండర్, క్లబ్ హౌస్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా గే సంబంధాలు నడుపుతూ తరచుగా వారితో నగ్న వీడియో కాల్స్, అసంబద్ధ లైంగిక సంబంధాలకు అలవాటు పడ్డారని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడు అంజన్‌పై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు గన్నవరం డీఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.