- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skill Case: చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మరోసారి షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే 30 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. రెండు రోజులు పాటు సీఐడీ కూడా ఆయన్ను విచారించింది. ఈ క్రమంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరఫున దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. ఇరువర్గాలు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. సీఐడీ కస్టడీ పిటిషన్లను డిస్మిస్ చేసింది.
కాగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులోనూ బిగ్ షాక్ తగలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. అంగళ్లు, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తోసి పుచ్చింది.
ఇక అంగళ్లు, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు పేరును పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు.. తాజాగా హైకోర్టులో మరోసారి నిరాశే ఎదురయ్యింది.