లోకేష్.. నీ DNA ఏంటో చెక్ చేసుకో: కొడాలి నాని ఫైర్

by Satheesh |   ( Updated:2023-02-17 09:51:14.0  )
లోకేష్.. నీ DNA ఏంటో చెక్ చేసుకో: కొడాలి నాని ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకోష్‌పై మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్‌ను చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో నాని మాట్లాడుతూ.. లోకేష్ యాత్రను జనం పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చెక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను బూతులు మాట్లాడుతా అనే వాళ్లకి.. చంద్రబాబు, లోకేష్ మాటలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ సీమబిడ్డ కాబట్టే.. సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయ్యారని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న లోకేష్ తన డీఎన్ఏ ఏంటో చెక్ చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి: సీఎం జగన్‌కు భయమేంటో చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్

Advertisement

Next Story