బాబు క్షమించినా.. వాళ్లను నేను క్షమించ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-06-13 15:40:49.0  )
బాబు క్షమించినా.. వాళ్లను నేను క్షమించ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ప్రభుత్వ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని, వాళ్లను సీఎం చంద్రబాబు క్షమించినా.. తాను మాత్రం అస్సలు క్షమించనని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం అనేక ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయన్నారు. మరోవైపు, చంద్రబాబు కేబినెట్ 4.0లో మంత్రి పదవి దక్కకపోవడంపైన అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు మంత్రి పదవి రాకపోయిన ఏం అసంతృప్తి లేదని అన్నారు. గతంలో తనకు 26 ఏళ్లకే మంత్రి పదవి వచ్చిందని.. మరీ అప్పుడు సీనియర్లు బాధపడ్డారా..? అని ప్రశ్నించారు. కొత్త రక్తం రావాలి.. యువ మంత్రులకు అండగా ఉంటామని అన్నారు. కాగా, ఎన్డీఏ కూటమి విజయం సాధిండచంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, చంద్రబాబు తాజా కేబినెట్‌లో అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలకు చోటు దక్కకపోవడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read More...

AP News:కొడాలి నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్..కారణం ఏంటంటే?

Advertisement

Next Story