- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Breaking: అది చూసే నేను వైసీపీలో చేరాను.. కారుమూరి సునీల్
దిశ,డైనమిక్ బ్యూరో: వైసీపీ అధిష్టానం కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కి పిలిచి మరి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం అందరికి సుపరిచితమే. కాగా తాజాగా మీడియాతో మాట్లాడిన సునీల్ తాను వైసీపీ లోనే ఎందుకు చేరారు అనే అంశం పై స్పష్టత ఇచ్చారు. రాజకీయాలంటే అయిష్టంగా వాటికి దూరంగా ఉండేవాడిని అని పేర్కొన్న ఆయన.. జగన్ చేస్తున్న మంచిని చూసాక తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ గురించి విన్నప్పుడు సర్లే ఎదో చేస్తున్నారని అనుకున్నట్లు వెల్లడించారు. కానీ డైరెక్ట్ గా వెళ్లి స్కూల్స్ ని చూసినప్పుడు, అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్ లు చూసి విద్యార్థులతో మాట్లాడాను.. ఆ తరువాత నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది అని తెలిపారు. ఇక తాను కూడా జగన్ లానే ప్రజలకు ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్లు తాను అడగకుండానే వైసీపీ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇచ్చినట్లు హర్షం వ్యక్తం చేసారు. ఇక స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్క నాయకుడు ఓట్ల గురించి ఆలోచించారు..కానీ ప్రజల గురించి ఆలోచించ లేదు అని ఆరోపించారు.
ప్రజల గురించి అలోచించి ప్రజలకు న్యాయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఏపీ సీఎం పై ప్రశంసల జల్లు కురిపించారు. అందరు నాయకులు ప్రజలను మోసం చేసి అబద్దపు హామీలతో అందలం ఎక్కారని వ్యాఖ్యానించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారని కొనియాడారు.