యురేనియం తవ్వకాలపై గ్రామస్తుల ఫైర్.. ప్రభుత్వానికి గ్రామాల ఆల్టిమేటం

by karthikeya |
యురేనియం తవ్వకాలపై గ్రామస్తుల ఫైర్.. ప్రభుత్వానికి గ్రామాల ఆల్టిమేటం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు (Kurnool) జిల్లా కపట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతివ్వడానికి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళనలు రోజు రోజుకూ విస్తృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా పరిసర ప్రాంతాల్లోని 4 గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు. తమ గ్రామాల్లో యురేనియం(Uranium) త్వవకాలు జరగనివ్వమని, తమను కాదని తవ్వకాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. చావనైనా చస్తాం కానీ, తవ్వకాలు మాత్రం జరగనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కౌలుట్ల చెన్నకేశస్వామి గుడి దగ్గర ప్రమాణం కూడా చేశారు. ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆల్టిమేటం జారీ చేశారు.

ఇదిలా ఉంటే కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం నిక్షేపాల నిర్ధారణ కోసం 68 బోర్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఏఎండీ) చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేంద్రం అనుమతులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతితో కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లోని 6.8 హెక్టార్లలో యూసీఐఎల్‌ అధికారులు త్రవ్వకాలు చేపట్టనున్నారు. అయితే అటవీ భూముల్లో త్రవ్వకాలు చేయాల్సి ఉండడం వల్ల కేంద్ర పర్యావరణ శాఖ (Central Environmental Department) ఆమోదం కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారు. భూగర్భంలో ఎంత పరిమాణంలో యురేనియం నిల్వలు ఉన్నాయో నిర్ధారించిన తర్వాతే తవ్వకాలు జరపాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed