మా నాయకులను కొనాలని చూస్తున్నారు.... జనసేన ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-04-17 10:34:22.0  )
మా నాయకులను కొనాలని చూస్తున్నారు.... జనసేన ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ, టీడీపీ కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. బలం పెంచుకునేందుకు నాయకులను కొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఈ పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీటు రాని నేతలు గోడ దూకుతున్నారు. దీంతో అసంతృప్తులను వలలో వేసుకునేందుకు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాయి. అధికార పార్టీ నేతలు ఇతర నాయకులను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా జనసేన నాయకులను కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారు.

కాగా పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటు జనసేన అభ్యర్థి ఉదయ్ దక్కింది. దీంతో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే పార్టీలో వర్గ విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ స్పందించారు. కాకినాడలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని కొట్టిపారేశారు. ఇదంతా అధికార పార్టీ నేతలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కుమార్ అక్రమ మైనింగ్‌కు సునీల్ కింగ్‌పిన్ అని ఆరోపించారు. 2019 నుంచి రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా కాకినాడను సునీల్ కుమార్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. టీడీపీ, జనసేన నాయకులను కొనాలని చూస్తున్నారని ఉదయ్ ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా జనసేన వాళ్లు అమ్ముడుపోరని.. ఎన్నికల్లో తమదే విజయమని ఉదయ్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed