ఆయనకో న్యాయం.. నాకో న్యాయమా? చంద్రబాబు అరెస్ట్‌పై కేఏ పాల్ స్పందన..

by Javid Pasha |   ( Updated:2023-09-13 11:37:57.0  )
ఆయనకో న్యాయం.. నాకో న్యాయమా? చంద్రబాబు అరెస్ట్‌పై కేఏ పాల్ స్పందన..
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తాను దీక్ష చేస్తే ఏ నోటీసు లేకుండా అరెస్ట్ చేశారని, తన మెడ, కాళ్ళు, చేయి విరగొట్టారని తెలిపారు. అదే చంద్రబాబు నాయుడిపై 12 సెక్షన్లు ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయడంలో జాప్యం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఒక న్యాయం.. తనకు ఒక న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. 'పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని ఆరోపించారు. 'ఒరేయ్ ప్యాకేజీ స్టార్.. నీకు చంద్రబాబు ఎంత డబ్బులు ఇచ్చారు. జనసైనికులు ఇప్పటికైనా అర్ధం చేసుకొని బయటకి వస్తే మన బడుగు బలహీన వర్గాలని గెలిపించుకుందాం' అని కేఏ పాల్ తెలిపారు.

Advertisement

Next Story