- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
chandrababu ''మాకు ఇదేమి ఖర్మ'': KA Paul తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు సభలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నిర్వహిస్తోన్న ''ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'' కార్యక్రమంపై సెటైర్లు వేశారు. చంద్రబాబు మాకు ఇదేమి ఖర్మ అని ఎద్దేవా చేశారు. కందూకురులో మీటింగ్ పెట్టినప్పుడే వార్నింగ్ ఇచ్చానని.. డీజీపీకి బుద్ధి ఉండొద్దా.. అనుమతి ఎలా ఇస్తారని ఫైర్ అయ్యారు. చట్ట విరుద్ధ సభలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు పోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించరా అని నిలదీశారు. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ ఇక సినిమాలే చేసుకోవాలని సూచించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి అప్పులు ఇప్పిచ్చానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తోన్న బహిరంగ సభల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలోని కందూకురులో చంద్రబాబు సభకు భారీ ఎత్తున ప్రజలు రావడంతో తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరవక ముందే నిన్న గుంటూరు సభలో మరోసారి తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Also Read...