- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్.. విరుచుకుపడ్డ రోజా
దిశ, వెబ్‌డెస్క్: సిల్క్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పలువురు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ, రామకృష్ణ స్పందించారు. తమ బావ (చంద్రబాబు) అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. కానీ, ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.
దీంతో నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు తప్పు ఏముందని పలువురు అంటుంటే.. నువ్వు అసలు నందమూరి ఫ్యామీలీయేనా అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే.. చంద్రబాబు జైలుకెళ్లాక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరుగుతున్న రచ్చపై తాజాగా ఏపీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ‘‘తెలుగుదేశం పార్టీ 2009లో జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకుని.. తీరా తన కొడుకు నారా లోకేష్ కోసం ఎన్టీఆర్‌ని పార్టీ నుంచి తొలగించి ఆయనపై కక్ష్య సాధించుకున్నారు. మరి చంద్రబాబు అరెస్ట్ కాగానే ఎన్టీఆర్‌ను ఎందుకు లాగుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను ఎందుకు మధ్యలోకి తెస్తున్నారంటూ రోజా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
Read More : స్కిల్ స్కామ్‌కు చంద్రబాబే బాధ్యుడు: Minister Bosta