- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:‘సొంత ఖర్చులతో బస్టాండ్ నిర్మిస్తాను’:జనసేన ఎమ్మెల్యే
దిశ,జీలుగుమిల్లి:జీలుగుమిల్లి మండలం ప్రజలకు సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జీలుగుమిల్లి మండలానికి విచ్చేసిన ఆయన ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండా బస్టాండ్ నేను నిర్మిస్తాను అని హామీ ఇచ్చారు. అలాగే ఈ స్టాప్ వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులు కూడా ఆగేలా RTC ఉన్నత అధికారులతో చరవాణి లో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎక్కడ గొంగళి అక్కడే ఉంది. గెలిచి 50 రోజులు అవ్వకుండానే పలు అభివృద్ధి పనులు చేస్తున్న ఎమ్మెల్యే బాలరాజు పనితీరు చూసి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ జీలుగుమిల్లి జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ పసుపులేటి రాము అనిల్ కోలా మధు బుట్టాయిగూడెం ప్రెసిడెంట్ బుచ్చి రాజు జనసేన పార్టీ నాయకుడు చిర్రి శ్రీను NDA కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.