- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరామ నవమి వేళ రాష్ట్ర ప్రజలకు జనసేన కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ కీలక పిలుపు నిచ్చారు. మే 13న జరిగే ఎన్నికల పోలింగ్‌లో వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడి.. రాష్ట్రం నుంచి తరిమేద్దాం అని జనసేన పిలుపునిచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో శ్రీరాముడికి ఎన్నో అవమానాలు జరిగాయని, అలాగే అనేక దేవాలయాలపై దాడులు చేశారని, ఈ దాడులను సమర్ధించి వైసీపీ నేతలు చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆలయాలను రక్షించుకునే ఎన్డీయే కుటమికి ఓటు వేసి పట్టం కడదాం అంటూ.. జనసేన తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న రానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అలాగే పోలింగ్ మే 13, ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.