- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: నాలుగు నెలలు ఆగండి.. అన్నీ సెట్ చేస్తా: పవన్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. విశాఖ రుషికొండలో సీఎం జగన్ కోసం కట్టిన ప్యాలెస్ ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ఇళ్లు సరిపోవా అని ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖ రుషికొండలో సీఎం జగన్ మరో ప్యాలెస్ కట్టుకున్నారని వ్యాఖ్యానించారు. రుషికొండలో ఖర్చు చేసిన డబ్బుతో విశాఖలో మరో ఫిషింగ్ హార్బర్ కట్టొచ్చని పవన్ పేర్కొన్నారు. విశాఖలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు నష్టపోయిన మత్స్యకారులను పవన్ పరామర్శించారు. అనంతరం వారికి రూ.50 వేలు చొప్పున ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నష్టపోయిన బోట్లకు సరిగా పరిహారం అందలేదన్నారు. ప్రతి బోటుకు 80 శాతం పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ మొత్తం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులందరికి న్యాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క జెట్టీ కూడా సరిగాలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్ తరహా జెట్టీలు కట్టుకుందామని పవన్ చెప్పారు.
‘మత్స్యకారులకు ఒక్కటే చెప్తున్నా. వైసీపీ ప్రభుత్వానికి 6 నెలలే సమయం ఉంది. 2 నెలలు అయిపోయాయి. ఇంకా మిగిలింది 4 నెలలు మాత్రమే. ఈ నాలుగు నెలలు భరించండి, మన ప్రభుత్వం వచ్చాక రౌడిమూకలు లేని, భద్రతతో కూడిన హార్బర్ ఉండేలా చేస్తాం.’ అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.