- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Breaking: పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన ఫైలట్ ప్రయాణానికి విముఖ వ్యక్తంచేశారు. ఈ ఘటనతో పవన్ కల్యాణ్ పర్యటించాల్సిన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలను వాయిదా వేశారు. హెలికాప్టర్ సమస్య కారణంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరుకు రాలేకపోతున్నానని పవన్ పేర్కొన్నారు. సభలకు సంబంధించి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కాగా గతంలోనూ పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు మరోమారు లోపం తలెత్తడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రయాణాలు సురక్షితంగా జరగాలని కోరుకున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థుల తరపున ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా వారాహి విజయభేరి యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సభలు ఏర్పాటు చేసి కూటమి గెలిస్తే ఏం చేస్తామనే విషయాలను ప్రస్తవిస్తున్నారు. ఇందులో భాగంగా సభలకు చేరుకునేందుకు పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారు. అయితే తరచూ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తెలత్తడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.