తమిళనాడులో ఎంపీగా పోటీ చేసేందుకు రోజా రెడీ: కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
తమిళనాడులో ఎంపీగా పోటీ చేసేందుకు రోజా రెడీ: కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి నగరిలో మంత్రి రోజాకు సీటు లేదని.. ఆమె తమిళనాడులో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ రోజా నగరిలో పోటీ చేసిన ఆమె ఓడిపోవడం ఖాయమని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో క్లారిటీ లేదు అని రోజా అనడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లేక యువత బెంగళూరు, చెన్నైకి వలస వెళ్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొత్త రోడ్లు వేయడంతో వైసీపీ కార్పొరేటర్లు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాదారుల నుండి తిరిగి భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Next Story

Most Viewed