- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: వచ్చే ఎన్నికల్లో నాగబాబు కుమార్తె నిహారిక పోటీ.. ఆ స్థానం నుంచే..!
దిశ, వెబ్ డెస్క్: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కుమార్తె నిహారిక వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ తరపున ఆమె రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ రంగం ప్రవేశం చేశారు. ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
అయితే ఇది ఒట్టి ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. నిహారిక పోటీపై నాగబాబు కుమారుడు, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ స్పందించారు. నిహారిక పోటీ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయంతా తాము ఏం చేయాలన్నా అది పెద్దల నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పారు. పెదనాన్న చిరంజీవి, తండ్రి నాగబాబు, బాబాయ్ పవన్ కల్యాణ్ ఏది చెప్తే అది చేస్తామని స్పష్టం చేశారు. తమ అవసరం ఉంటే తప్పకుండా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.