- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బలమైన కార్యాచరణతో జనంలోకి జనసేన!
దిశ, ఏలూరు ప్రతినిధి: ఏపీలో కీలక అసెంబ్లీ స్థానాల్లో పోలవరం ఒకటి. ఈ తరుణంలో పోలవరంలో ఈ సారి పట్టు బిగించేందుకు జనసేన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పొత్తులపై అధిష్టానం నుంచి స్పష్టత రాకపోవడం తో సింగిల్ గా ప్రజలకు దగ్గరవుతోంది. అటు అధికార పక్షానికి దీటుగా, ఇటు మిగిలిన పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలకు చేరువవుతోంది. అధినేత ఆదేశాలతో పోలవరం ఇన్చార్జి చిర్రి బాలరాజు గెలుపు ధీమాతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో పట్టులేని ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక అజెండాతో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై జనసేన ముందడుగు వేసి గొంతు ఎత్తి తమ గళాన్ని వినిపిస్తోంది.
వెనుకబడిన మండల కమిటీలు
పోలవరం నియోజకవర్గంలో జనసేన బలోపేతం కాకపోవడానికి మండల కమిటీల పనితీరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పోలవరం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, టీ నర్సాపురం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడులో మండల స్థాయి కమిటీలు ఉన్నప్పటికీ పని తీరు మాత్రం అటకెక్కుతోందని తెలుస్తోంది. అధినేత పిలుపుతో నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్నప్పటికీ మండల స్థాయిలో మాత్రం జనసేన పార్టీ కార్యక్రమాలకు సిద్ధమవడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం లేకుండా ఉంటే పార్టీకి ఎక్కువ నష్టం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి
నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ ఇన్చార్జి బాలరాజు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవి ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెల్లో, గ్రామాల్లో జనసేన పార్టీ గుర్తుండే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. మారుమూల గిరిజనుల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళుతున్నారు. గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ పరాజయం పొందడానికి గల కారణాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
గెలుపు ధీమాలో జన సైనికులు
నియోజకవర్గంలో జనసేన గెలుపుపై జన సైనికులు ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ విధానంతో విసుగెత్తిన నియోజకవర్గ ప్రజలు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారని, టీడీపీ హయాంలో నియోజకవర్గంలో అంతంతమాత్రం అభివృద్ధి కనపడుతోందని అంటున్నారు. అందుకే తమకు అవకాశం ఇస్తే ప్రజలకు మేలు చేస్తామని చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో అధికార పార్టీ నాయకులు ప్రజలను ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. వీరందరికీ జనసేన అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
రోడ్లు వేయాలని పాదయాత్ర
నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల దుస్థితి అధ్వానంగా ఉంది. దీంతో పోలవరం జన సైనికులు రోడ్ల సమస్యపై కదం తొక్కారు.బుట్టాయగూడెం మండలంలో దొరమామిడి నుంచి బుట్టాయగూడెం వరకు ఉన్న ప్రధాన రహదారిని తక్షణమే నిర్మించాలని పాదయాత్ర నిర్వహించారు. సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర వానలో కొనసాగింది. వైసీపీ చేసే తప్పుడు రాజకీయాలకు భయపడే పార్టీ ప్రసక్తే లేదని చెబుతున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రజల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేసింది.