పొత్తులకు వెళ్లడానికి ఓ కీలక వ్యక్తి కారణం: పవన్ కల్యాణ్

by GSrikanth |
పొత్తులకు వెళ్లడానికి ఓ కీలక వ్యక్తి కారణం: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పొత్తులకు వెళ్లడానికి ఓ వ్యక్తి కీలక కారణం అన్నారు. గత ఎన్నికల్లో బంధుత్వాలతో సంకెళ్లు వేశారని అన్నారు. నిర్ణయం తీసుకున్నాక ప్రత్యర్థులే ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోజు భీమవరంలో గెలిచి ఉంటే ఇవాళ లెక్క వేరే ఉండేదని అన్నారు. ఎమ్మెల్యేగా నాతో పాటు పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయినా ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అంధకారంలోకి వెళ్లక తప్పదని అన్నారు. దళితుడ్ని చంపి డోర్ డెలివరీ చేసిన పార్టీ అది అని తెలిపారు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం సొంత కుటుంబాన్నే కాదనుకొని వచ్చానని తెలిపారు.

ఆశయం కోసం ముందు వెనుక ఆలోచించబోను అని తెగేసి చెప్పారు. రాజకీయాల్లో బంధుత్వం ఉండదని.. యుద్ధం మాత్రమే ఉంటుందని అన్నారు. యుద్ధం అంతిమ లక్ష్యం ప్రభుత్వం మారేలా చేయడమే అని తెలిపారు. ఈ యుద్ధంలో జగన్ లాంటి జలగల్ని ఏరిపారేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో గొడవలు తగ్గించే వ్యక్తులు కావాలి కానీ.. గొడవలు పెంచే వ్యక్తి కాదని అన్నారు. ఎవరెన్ని కోట్లు పంచినా ఈ సారి భీమవరాన్ని వదలబోను అని.. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 175 సీట్లలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పోటీ చేస్తుందని అన్నారు.

Advertisement

Next Story